సచివాలయంలో మిషన్ భగీరథపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా వివరాలను మంత్రికి అధికారులు నివేదించారు. ఇప్పటి వరకు ఎక్కడా తాగునీటి సమస్య లేదని అధికారులు తెలిపారు.