విజయవాడలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది.. మాచవరం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ భవానీ... విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ విధులు నిర్వహిస్తోంది.. అయితే, నిన్న రాత్రి నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ పోలీస్ కానిస్టేబుల్ బుక్యా సాగర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తాజాగా నేడు చికిత్స పొందుతూ ఆయన మరణించారు. జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో బుక్యా సాగర్ విధులు నిర్వర్తించారు.
Student suicide: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్వీ ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ మురళీ వేధింపులతో ఇంటర్మీడియట్ విద్యార్థి చెల్లుబోయిన అచ్యుత్ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు.
Suicide Attempt: బీహార్ లోని మోతీహరిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోవాలని రైల్వే ట్రాక్‌పై పడుకున్న బాలిక గాఢనిద్రలోకి జారుకుని అక్కడే పడుకుండి పోయింది. మరోవైపు అదే ట్రాక్ మీదుగా వెళ్తున్న రైలును లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఎలాగోలా ఆపేశాడు. అదృష్టవశాత్తూ ఎలాగోలా బాలిక ప్రాణానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఈ ఘటన మోతీహరి లోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవాలనే…
Quarrel with wife: తన భార్యతో గొడవ పడిన 45 ఏళ్ల వ్యక్తి పూణేలోని పవన నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అనూహ్యంగా అతను 8 గంటల తర్వాత ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. పోలీసులు, అగ్నిమాపక దళాలు గంటల పాటు రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించిన అతడి ఆచూకీ లభించలేదు, చివరకు నదిలోని పొదలల్లో వేలాడుతున్న స్థితిలో కనిపించాడు.
రైలు కిందపడి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు.. పట్టాలపైకి ఎక్కారు.. తీరా రైలు వచ్చే సమయానికి ఓ ప్రేమికుడు.. తన ప్రియురాలు బతకాలని అనుకున్నాడు.. దీంతో.. ప్రియురాలిని రైలు పట్టాల పై నుంచి కిందకి తోసేసి.. తాను మాత్రం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
Suicide Attempt: మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ బ్రిడ్జిపై గత కొద్ది రోజులుగా ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్నాయి. మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అటల్ సేతు సి లింక్‌లో ఆత్మహత్యకు యత్నిస్తున్న మహిళను రక్షించిన సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు ధైర్యం ప్రదర్శించి మహిళ ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Manu Bhaker: షూటింగ్ ని పక్కన పెట్టి వాటిని ప్రాక్టీస్…
రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. అమ్మాయి ప్రేమించడం లేదనో, ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో, పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
Passenger Suicide Attempt in Flight: తైవాన్‌కు చెందిన ‘ఇవా ఎయిర్‌లైన్స్’ ఫ్లైట్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన గత శుక్రవారం (మార్చి 15) జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుడి వివరాలు, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఇవా ఎయిర్‌లైన్స్ వెల్లడించలేదు. ఇవా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీఆర్ 67 ఫ్లైట్ మార్చి 15న బ్యాంకాక్…
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది మహిళ. ఆ మహిళను ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కొండేపూడి జ్యోతిగా గుర్తించారు. అయితే.. ఆ మహిళ ఆత్మహత్యహత్నం కారణం.. ఉప్పే బాపిరాజు అనే వ్యక్తి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.