దేశంలో హిందీ భాషా వివాదం నడుస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మధ్య మొదలైన హిందీ భాషా వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా హిందీ భాషా వివాదంపై సీనియర్ నటి సుహాసిని స్పందించారు. నటులు అన్న తర్వాత అన్ని భాషలు నేర్చుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. హిందీ భాష అనేది మంచి లాంగ్వేజ్ అని.. అది కూడా నేర్చుకోవాలని.. అది ముఖ్యమని వ్యాఖ్యానించారు. హిందీ మాట్లాడే వాళ్ళు మంచి వాళ్లు…
చెన్నయ్ లో శుక్ర, శనివారాల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ జోన్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మెట్ జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించిన ఈ సమ్మెట్ లో దక్షిణాదికి చెందిన అగ్ర దర్శకులతో పాటు, స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. విశేషం ఏమంటే… గత కొన్ని రోజులుగా ఈ సమ్మెట్ నిర్వహణ బాధ్యతలను ప్రధానంగా నలుగురు మహిళామణులు తమ భుజాలకెత్తుకుని సమన్వయంతో నిర్వహిస్తున్నారు. వారే…
(అక్టోబర్ 2న ‘రాక్షసుడు’కు 35 ఏళ్ళు పూర్తి) తెలుగు సినిమా మూడోతరం కథానాయకుల్లో నవలానాయకుడు అన్న ఇమేజ్ సొంతం చేసుకున్నది మెగాస్టార్ చిరంజీవే! ఆయన నటించిన పలు నవలా చిత్రాలు విజయకేతనం ఎగురవేశాయి. చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి, క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్.రామారావు, ఇళయరాజా, యండమూరి కాంబినేషన్ లో రూపొందిన నవలా చిత్రాలు తెలుగువారిని విశేషంగా మురిపించాయి. అంతకు ముందు ఈ కాంబినేషన్ లోనే రూపొందిన ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ చిత్రాలు అటు మ్యూజికల్ హిట్స్ గానూ, ఇటు కమర్షియల్ సక్సెస్…
(ఆగస్టు 15న సుహాసిని పుట్టినరోజు) తెలుగునాట పుట్టకపోయినా, తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు ఎందరో కళాకారులు. వారిలో సుహాసిని స్థానం ప్రత్యేకమైనది. నిజానికి తమిళ చిత్రాలతోనే అరంగేట్రం చేసినా, తరువాత తెలుగు చిత్రాలతో సూపర్ హీరోయిన్ గా జేజేలు అందుకున్నారు సుహాసిని. తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన తరువాతే ‘సింధుభైరవి’తో జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచారామె. తెలుగు చిత్రాల వల్లే తనలోని నటి మెరుగు పడిందని సుహాసిని గర్వంగా చెప్పుకొనేవారు. ఆమె కళాకారుల కుటుంబంలోనే…
(జూన్ 19న ‘మౌనగీతం’కు 40 ఏళ్ళు పూర్తి) విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని… అంటారు కానీ, ఆ వింత చేష్టలనే ‘విధి లీల’ అనీ చెబుతారు. సుహాసిని నటించిన తొలి చిత్రం ‘నెంజతై కిల్లాదే’. దీని అర్థం ‘మనసును గిల్లకు’ అని. ఈ సినిమాను తెలుగులో ‘మౌనగీతం’ పేరుతో అనువదించారు. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘మౌనగీతం’గానూ అలరించింది. అలా ‘మౌనగీతం’తో సుహాసిని తెలుగువారిని పలకరించక ముందే ఆమె నటించిన తొలి తెలుగు…