రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో మేనమామ పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఇద్దరు చిన్నారులను విధి వెంటాడింది. ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని పామేన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, జ్యోతి దంపతుల కుమార్తె తన్మయి శ్రీ(5), షాబాద్ మండలం సీతారాం పూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కుమార్తె అభినయ శ్రీ (4) తన…