కరోనాకు పుట్టినిలైన చైనాను మహమ్మారి మరోసారి కుదిపేస్తోంది. షాంఘైలో కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ఆకలి కేకలతో చైనా అల్లాడిపోతోంది. కరోనా కఠిన లాక్‌డౌన్‌తో జనం అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి దొరకడం లేదని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిత్యం 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం గరిష్ఠంగా ఒక్కరోజే 25 వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి…