సుడిగాలి సుధీర్ అలియాస్ సుధీర్ ఆనంద్ హీరోగా ఇటీవల కొత్త చిత్రం ఆరంభమైన విషయం తెలిసిందే. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘హైలెస్సో’ అని టైటిల్ ఖరారు చేశారు. సుధీర్ సరసన హీరోయిన్లుగా నటాషా సింగ్, నక్ష శరణ్ నటిస్తున్నారు. అక్షర గౌడ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవి కిరణ్ నిర్మిస్తున్నారు. హైలెస్సో సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హైదరాబాద్ పరిసరాల్లో…