Subhaleka Sudhakar: శుభలేఖ సుధాకర్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బక్కపలచని శరీరం, కళ్ళజోడు.. నున్నగా పక్కకు దువ్విన తల.. వెటకారంగా ఒక నవ్వు.. అప్పటి సినిమాల్లో ఇదే అతడి రూపం. శుభలేఖ సినిమాలో ఆయనను నటనకు గుర్తింపు రావడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఇక కెరీర్ మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.