సీనియర్ సిటిజన్లుతో పాటు.. జర్నిలిస్టులకు, విధ్యార్థులకు ఊహించని షాక్ ఇచ్చింది రైల్వేశాఖ. టికెట్ ధరపై సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీ కట్ చేయడమేకాకుండా.. విద్యార్థులు, జర్నలిస్టులకు వివిధ కోటాల్లో ఇస్తున్న సబ్సిడీలను మంగళం పాడింది. అయితే గతంలో అమలులో ఉండి ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ తొలగించిన సబ్సిడీలపై కేంద్ర సర్కార్ తాజాగా తన అభిప్రాయాన్ని తెలిపి, సబ్సీడీలను తిరిగి పునరుద్దరించే అవకాశం లేదని తేల్చి చెప్పేసింది. నిజానికి కరోనా సమయంలోనే అన్ని రాయితీలను రైల్వే శాఖ…