Railway Shock: సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు రైల్వేశాఖ షాక్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ సిటిజన్లుతో పాటు.. జర్నిలిస్టులకు, విధ్యార్థులకు ఊహించని షాక్ ఇచ్చింది రైల్వేశాఖ. టికెట్ ధరపై సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీ కట్ చేయడమేకాకుండా.. విద్యార్థులు, జర్నలిస్టులకు వివిధ కోటాల్లో ఇస్తున్న సబ్సిడీలను మంగళం పాడింది. అయితే గతంలో అమలులో ఉండి ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ తొలగించిన సబ్సిడీలపై కేంద్ర సర్కార్ తాజాగా తన అభిప్రాయాన్ని తెలిపి, సబ్సీడీలను తిరిగి పునరుద్దరించే అవకాశం లేదని తేల్చి చెప్పేసింది.
నిజానికి కరోనా సమయంలోనే అన్ని రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసింది. సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని కట్ చేసింది. విద్యార్థులకు, జర్నలిస్టులకు తదితరులకు ఇచ్చే రాయితీని నిలిపివేసింది. కాగా.. 50 ఏళ్లు దాటిన మహిళలకు రైల్వే శాఖ 50 శాతం, 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ ధరలో 40 శాతం రాయితీ ఇచ్చేది. ఒక జర్నలిస్టులకు 50 శాతం రాయితీ, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఏడాదిలో రెండుసార్లు రాయితీపై ప్రయాణించే అవకాశం కల్పించేది. ఇక విద్యార్థులకు జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాయితీలు ఉండేవి, దావ్యాంగలకు కూడా కొన్ని రాయితీలు అందించేది రైల్వేశాఖ. ఇటువంటి రాయితీలకు రైల్వే శాఖస్వస్తి చెప్పింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అయితే గతంలో సీనియర్ సిటిజన్లకు ఉన్న రాయితీలను పునరుద్దరించే ఉద్దేశం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్ లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైల్వే శాఖకు నష్టాలు రావడానికి కారణాలు చెప్పకొచ్చారు. రైల్వే టికెట్ ధరలు తక్కువగా ఉండటమే నష్టానికి కారణమని , కొవిడ్ కారణంగా ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. రాయితీ వల్ల రైల్వేశాఖపై భారం పడుతోందని పేర్కొన్నారు. రాయితీ వల్ల 2017-20 మధ్య కాలంలో 4వేల 794 కోట్ల రూపాయల ఆదాయాన్ని భారతీయ రైల్వేలు నష్టపోయాయని, అందుకే సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, విద్యార్థులకు రాయితీ పునరుద్ధరణ కుదరదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తేల్చి చెప్పారు.
Goods and Services Tax : ఏం తినేటట్టు లేదు..ఏం కొనేటట్టు లేదు..సామాన్యుడిపై జీఎస్టీ బాదుడు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!