ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారుల బృందాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు నిర్వహిస్తున్నాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం, పలనాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి రేణిగుంట, విజయనగరం భోగాపురం, విశాఖ మధురవాడ, ఒంగోలు, కర్నూలు కడప వంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు పనిచేయడంతో పాటు ఏజెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది కొమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని అంశాల మీద విచారణ చేస్తున్నారు.…