ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా షూటింగ్ స్పాట్స్, స్టూడియో నిర్మాణం, రీ-రికార్డింగ్ స్టూడియోల అభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్, మరియు నంది అవార్డ్స్ వంటి ముఖ్యమైన అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో సినీ…