School Bus Fire Accident: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని కృష్ణారెడ్డి పేటలో ఈ రోజు ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో విద్యార్థులను ఎక్కించుకుంటుండగానే మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సులో మంటలు రావడం గమనించిన డ్రైవర్, క్లీనర్ తక్షణమే స్పందించి విద్యార్థులను త్వరగా సురక్షితంగా బస్సు నుండి కిందకు దింపేశారు.…
గత కొద్ది రోజులు భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానలతో ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వానలకు జిల్లాల్లో వాగులు వంగలు నిండి పరుగులు పెడుతున్నాయి. ఈనేపథ్యంలో.. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సుమాచన్‌పల్లి- కోడూరు మధ్య వరదలు ముంచెత్తడంతో రామచంద్రపురం నుంచి సూగూరు తండాకు వెళ్తుండగా ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అండర్‌బ్రిడ్జిలో భారీగా నీళ్లు పారుతున్నాయి. అదిగమనించకుండా డ్రైవర్ అలాగే బస్సును ముందుకు…