CPM Srinivasa Rao: ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. ఆ లేఖలో ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని 27వ తేదీన విశాఖపట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాల్సింది పోయి సవరించాలని చెప్పడం ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది అని తెలిపారు.