మానవునికి అందుబాటులో ఉన్నదానికంటే అందని దాని మీదనే ఎక్కువ మక్కువ. తెలియని రహస్యాలని చేదించాలనే ఆసక్తి మనిషిని అంతరిక్షం వైపు అడుగులు వేయించింది. ఆ నిశిలో ఏ నిగూడ రహస్యం దాగిందో అని భూమి మీద ఉన్న మనిషి వెతుకులాట. ఆ వెతుకులాటలో ఎన్నో కొత్త విషయాలను వెలికి తీశారు. వెలుగు చూసిన రహస్యాలు ఇసుక రేణువంత అయితే బయటపడని రహస్యాలు ఖగోళమంత.