వంట నూనెల ఎంఆర్‌పీని 10 రూపాయలు తగ్గించాలన్న కేంద్రం ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల రేట్లు దిగొచ్చిన నేపథ్యంలో వాటి గరిష్ట చిల్లర ధరను ఆ మేరకు సవరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దిగుమతి చేసుకునే నూనెల ఎంఆర్‌పీని 10 రూపాయలు తగ్గించాలని అడిగింది. మన దేశం వంట నూనెల వినియోగంలో 60 శాతానికి పైగా సరుకును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రూపాయి విలువను పెంచేందుకు చర్యలు ప్రకటించిన ఆర్బీఐ ఈ ఏడాది…
పబ్లిక్ ఆఫర్ పట్ల పునరాలోచనలో పడ్డ 3 స్టార్టప్‌లు? ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల విషయంలో అంటే ఐపీఓల విషయంలో 3 స్టార్టప్‌లు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఫార్మ్‌ఈజీ, బోట్, ఇక్సిగో అనే ఈ మూడు సంస్థల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. అన్‌లిస్టెడ్ ఈక్విటీ మార్కెట్‌లో వీటి షేర్లకు క్రేజ్ తగ్గింది. దీంతో ఐపీఓల పట్ల ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపట్లేదని వార్తలొస్తున్నాయి. పబ్లిక్ ఆఫర్‌లో పాల్గొని పేలవమైన ప్రదర్శన చేయటం ద్వారా బ్రాండ్ వ్యాల్యూని ఇంకా…
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 616 పాయింట్ల లాభంతో 53,750 వద్ద ముగియగా.. నిఫ్టీ 178 పాయింట్ల లాభంతో 15,989 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో ఉదయం నుంచి లాభాల్లోనే ట్రేడయిన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. సెన్సెక్స్‌లో బ్రిటానియా, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాలను ఆర్జించగా… ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,…
బుధవారం భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు గురువారం నాడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 443 పాయింట్ల లాభంతో 52,265 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 15,556 వద్ద స్థిరపడింది. ఒక దశలో 600 పాయింట్ల వరకు సెన్సెక్స్ లాభపడుతుందని విశ్లేషకులు భావించారు. అటు నిఫ్టీ కూడా 15,600 పాయింట్లను దాటుకుని వెళ్లింది. అయితే చివరకు లాభాల జోరు తగ్గింది. ఈరోజు ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఆటో,…
నిన్న బుధవారం నష్టాల్లో బాట పట్టిన సూచీలు నేడు ఎగబాకుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో వెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల లాభం పడడంతో 52 వేల 300 పైన ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిప్టీ 150 పాయింట్లు ఎగబాకి15 వేల 560 వద్ద లాభాలు పూయిస్తోంది. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, ఐచర్ మోటార్స్, భారతీ…
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు విలవిలలాడాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. ఫలితంగా సెన్సెక్స్ 709 పాయింట్ల భారీ నష్టంతో 51,822 వద్ద ముగియగా నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 15,413 వద్ద స్థిరపడింది. గత రెండు రోజులు లాభాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ముచ్చటగా మూడోరోజు అలాంటి లాభాలను చవిచూడలేక చతికిలపడ్డాయి. నిఫ్టీ 50లో ఐదు కంపెనీలు లాభాల్లో ముగియగా..…
దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 934 పాయింట్ల లాభంతో 52,532 వద్ద ముగియగా.. నిఫ్టీ 288 పాయింట్ల లాభంతో 15,638 వద్ద స్థిరపడింది. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే ధోరణిని ప్రదర్శించాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క నెస్లే ఇండియా మాత్రమే నష్టాలను చవిచూసింది. మిగతా కంపెనీల షేర్లు లాభాలను గడించాయి. అత్యధికంగా లాభాలను గడించిన కంపెనీలలో టెక్ దిగ్గజాల షేర్లు ఉన్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, టెక్…