స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు అందించే షేర్లను వెతికి పట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందుకోసం తమదైన పద్దతిలో రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రముఖ బ్రోకరేజి కంపెనీ మోతిలాల్ ఓస్వాల్ ప్రముఖమైన ఐదు షేర్ల పేర్లను రికమండ్ చేసింది.
2000 Note : సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2000 రూపాయల నోటును రద్దు చేసింది. ఈ పింక్ నోటుపై గతేడాది నుంచి పుకార్లు మొదలయ్యాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఈ పుకార్లకు స్వస్తి పలికింది. 19 మే 2023న, శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా రూ.2000 నోటును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
Nifty: నిఫ్టీ భారీ బూమ్‌ను చూస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 0.80 శాతం లేదా 349 పాయింట్ల పెరుగుదలతో 44000 పైన ట్రేడవుతోంది. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఎనర్జీ, ఇన్ఫ్రా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు కూడా బుల్లిష్‌గా ఉన్నాయి.
Jio Ipo: రిలయెన్స్ జియో కంపెనీ ప్రజల్లోకి ఎంత వరకు వెళ్లిందంటే.. ఇప్పుడు ఆ పేరు తెలియనివారు లేరనే రేంజ్‌కి చేరుకుంది. అదే స్థాయిలో జియో ఫైనాన్షియల్ సంస్థ కూడా జనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ నెలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి రావాలనుకుంటోంది.
Christmas Effect on Stock Market: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. ఆ పండగ ప్రభావం ఇండియన్ స్టాక్‌మార్కెట్ పైన కూడా పాజిటివ్‌గా కనిపించనుందని విశ్లేషకులు అంటున్నారు. పిల్లలకు, పెద్దలకు కేకులను, ఆట బొమ్మలను బహుమతులుగా తేవటం ద్వారా క్రిస్మస్ తాత.. శాంతాక్లాజ్.. ఏవిధంగా అయితే సర్ప్రైజ్ చేస్తారో.. అదేవిధంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీని కూడా రైజ్ చేస్తారని చెబుతున్నారు. తద్వారా.. స్టాక్స్ వ్యాల్యూ ర్యాలీకి పరోక్షంగా దోహదపడతారని అంచనా వేస్తున్నారు.
Forex : అంతర్జాతీయంగా చాలా దేశాల్లో మాంద్యం పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దేశాల ఆర్థిక ఆటుపోట్ల ప్రభావం భారత పరపతి రేటింగ్‌పై పెద్దగా ఉండదని అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ ‘ఫిచ్ రేటింగ్స్’ తెలిపింది.
Early Diwali to India: మన దేశానికి ఈ ఏడాది దీపావళి పండుగ ముందే రానుందని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలకూ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇండియాకి లెదర్, టెక్స్టైల్, జ్యులరీ, ప్రాసెస్డ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఎగుమతులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
UDAN Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఉడాన్ పథకంలో భాగంగా గత ఐదేళ్లలో లక్షన్నరకు పైగా విమానాలను ప్రారంభించామని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. విమానయాన పరిశ్రమను ప్రజాస్వామ్యీకరించామని అన్నారు.
Business Flash 19-07-22: బెంగళూరుకు చెందిన సెల్ 'ఆర్ అండ్ డీ' ఫెసిలిటీలో ఓలా ఎలక్ట్రిక్ 4000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఇక్కడ అత్యంత అధునాతన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు.