India in World Steel Production: ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం మన దేశమే నంబర్-2 పొజిషన్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడచిన 8 ఏళ్లలో స్టీల్ ప్రొడక్షన్ రెట్టింపైందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో వెల్లడించారు. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పురోగతి చోటుచేసుకోలేదని చెప్పారు. 2013-14లో ఏడాదికి 6 కోట్ల టన్నుల ఉక్కును మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్లం.
ప్రపంచంలో అత్యధిక స్టీల్ ను ఉత్పత్తి చేసే దేశాల మధ్య వార్ జరుగుతుండటంతో ప్రపంచ దేశాల్లో స్టీల్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రపంచంలో ఎక్కువశాతం స్టీల్‌ను రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఉత్పత్తి చేస్తుంటాయి. అక్కడి నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే, రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా రెండు దేశాల నుంచి స్టీల్ ఉత్పత్తి, ఎగుమతులు ఆగిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రపంచంలో స్టీల్ సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. Read:…