ప్రపంచంలో ఇప్పటి వరకు ఏడు అద్భుతాలు ఉన్నాయి.. ఇప్పుడు రామానుజ సమతా మూర్తి విగ్రహం ఎనిమిదో అద్భుతం అని అభివర్ణించారు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. ఇవాళ ముచ్చింతల్ ఆశ్రమానికి వచ్చిన ఆయన.. శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల వారి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సమతామూర్తి సందర్శన తనకు లభించిన మహాభాగ్యం అని వెల్లడించారు. సమతామూర్తి కేంద్రం ప్రపంచంలో 8వ వింతగా పేర్కొన్నారు.. సమాత మూర్తి విగ్రహం ఏర్పాటు చేసినందుకు భారత ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.
Read Also: Vikramarka: మోడీ, బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలి.. సీఎంను బర్తరఫ్ చేయాలి
సాటి జనులకు సేవ చేయడమే అత్యంత ఆధ్యాత్మికం అన్నారు వెంకయ్యనాయుడు.. చిన్నారి ఇద్య స్వల్పం కాలం భారతీయ కళను అద్భుతంగా చేసినందుకు అభినందించారు.. భారతీయ సనాతన ధర్మం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రేరణ ఇస్తుందన్న ఆయన.. సానుకూల విప్లవానికి నాంది పలికిన సమతామూర్తి దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.. మూఢ నమ్మకాలు, కుల నిర్మూలన కోసం వెయ్యి ఏళ్ల కింద కృషి చేశారని గుర్తుచేసిన ఆయన.. దేవుడి ముందు అందరూ సమానమే అని చాటి చెప్పిన ఘనుడు ఆయన అని.. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించారని.. కులం కన్న.. గుణం మిన్న అని చాటి చెప్పారని.. కొందరు స్వార్థంతో కులాలను ప్రొత్సహిస్తున్నవారు.. సమతామూర్తి బోధనలు గుర్తించుకోవాలని సూచించారు వెంకయ్యనాయుడు.