తెలంగాణ ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు ఉన్నాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పట్టా భూమి కూడా నిషేధిత జాబితాలో ఉంది. దాదాపు 30 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ధరణిలో పట్టా ఉన్న భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు తూకంలో మోసం జరుగుతుందని అన్వేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి…