బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
ప్రభుత్వం పంపుతున్న ఆహార ధాన్యాల్లో మూడో వంతు పేదలకు చేరడం లేదు. భారత ఆహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న 28 శాతం ధాన్యాలు అనుకున్న లబ్ధిదారులకు చేరడం లేదని ఎకనామిక్ థింక్ ట్యాంక్ విడుదల చేసిన రిపోర్ట్‌లో వెల్లడైంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.69,000 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అంచనా. అలాగే.. ఈ వ్యవస్థను తక్షణమే మెరుగుపరచాలనే డిమాండ్ కూడా ఉంది.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటైపోయి స్టీల్ ప్లాంట్ లో 4వేల మంది కార్మికులను తొలగించటానికి సిద్ధం అవుతున్నాయని ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ అన్నారు. ఏ ఒక్కరినీ తొలగించటానికి అడుగులు వెయ్యొద్దని డిమాండ్ చేశారు.
మూక హత్యలను అరికట్టేందుకు ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు వేసింది. గోసంరక్షకులు, అల్లరిమూకల కేసులపై తీసుకున్న చర్యల గురించి ఆరు వారాల్లోగా తెలియజేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం మహిళా సంస్థ పిటిషన్‌ను ఆరు వారాల తర్వాత విచారించాలని నిర్ణయించింది.
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటించారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదు అనేది అవాస్తవం.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే
కేరళ ఆర్థిక సంక్షోభానికి కారణం మీరంటే మీరేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే కారణమని.. ప్రభుత్వం వృథా ఖర్చులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణమని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తుంది.
దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు.
కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పెట్రోల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మోదీ ఆరోపించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా.. రాష్ట్రాలు తగ్గించలేదన్నారు. రాష్ట్రాల తీరు వల్లే ధరలు పెరుగుతున్నాయని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని.. అప్పుడే ప్రజలపై పెట్రోల్ ధరల…
దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే న్యూస్ అందించింది. ఇకపై దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా కేంద్రం నుంచి 60 శాతం మాత్రమే నిధులు వస్తాయని స్పష్టం చేసింది. మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాకుండా నిబంధనల ప్రకారం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తేనే… కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదల అవుతాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర…
ఒమిక్రాన్ ఎంట్రీతో భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది.. భారీగా కేసులు వెలుగు చూశాయి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. కోవిడ్ విజృంభణ సమయంలో కఠిన ఆంక్షలు విధించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. మళ్లీ సడలింపులు ఇస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను మూసివేసి.. ఆన్‌లైన్ విద్యకే పరిమితం అయ్యాయి.. ఇప్పుడు మళ్లీ విద్యాసంస్థలను తెరవడంపై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ సమయంలో.. స్కూళ్ల పునః ప్రారంభంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. Read Also:…