తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. జిల్లాలోని రంపచోడవరం, ఎటపాక డివిజన్లలో ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 16న నిర్వహించనున్న పోలింగ్ సమయాన్ని కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మారేడుమిల్లి మండలం దొరచింతవానిపాలెం, వీఆర్ పురం మండలం చినమట్టపల్లి ఎంటీటీసీ స్థానాలు, ఎటపాక మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 16న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని ఎస్ఈసీ తెలిపింది. అధికారులు ఈ విషయాన్ని ఆయా మండలాల్లోని…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాళ చివరి రోజు భారీగా నమోదయ్యాయి నామినేషన్లు. 15న మునిసిపాలిటీ, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు స్వంత నియోజకవర్గం అయిన కుప్పం, నెల్లూరు కార్పోరేషన్ పైనే అందరి ఫోకస్ పడింది. కుప్పంలో పాగా వేయాలని వైసీపీ స్కెచ్ వేసింది. అక్కడ ఎలాగైనా పరువు నిలుపుకోవాలని టీడీపీ నేతలు పట్టుమీద వున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికపై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఎస్‌ఈసీ అధికారులు ఎన్నికలను ఇవాళ నిర్వహించారు. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరిగింది. గతంలో మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగించారు. ఈమేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్, డిప్యూటీ మేయర్‌ల పదవులకు…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఎన్నిక నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరుగనుంది ఎన్నిక. మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగిస్తూ ఈనెల 12న తీర్మానం చేశారు. ఈమేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్,…
కోవిడ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్న దృష్ట్యా, అలాగే వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కాల్ చేసినట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని వివిధ వర్గాలు లేవనెత్తుతున్న అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాము ఎలక్షన్ కమిషన్ సూచించిన…