వైసీపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈనెల 5వ తేదీన వైసీపీ తలపెట్టిన ఫీజు పోరు ర్యాలీకి అనుమతివ్వాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు మెయిల్ ద్వారా వినతిపత్రం పంపారు. శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతివ్వాలని ఎన్నికల అధికారిని కోరారు.
పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ ఆదేశించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమక్షంలో ఐ.జి. నాగిరెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమీషనర్ పాల్గొన్నారు. హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.…