హైదరాబాద్ అంబర్ పేటలో సేవ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఇప్పటికే డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, ఆర్ట్స్ కాలేజీ చరిత్ర తెలిసేలా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ పెట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ ను నిర్లక్ష్యం చేస్తుందని…
బుల్లెట్‌ని కిక్-స్టార్ట్ చేయడం ఎక్కువగా మగవాళ్లకు తెలుసు. కొన్నిసార్లు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు అది తిరిగి రివర్స్ లో వస్తుంది. ఆ కిక్ ను కొట్టాలంటే బలంగా.. సరైన పద్ధతిలో చేయాలి. లేదంటే.. తిరిగి వచ్చి అది కాలుకు దెబ్బతీస్తుంది. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అనుకున్న సమయం కంటే గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైంది. నిన్న 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రెండో రోజు అక్కడి నుంచే బ్యాటింగ్ మొదలెట్టింది. నిన్న మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన టీమిండియా.. ఇవాళ కూడా దూకుడుగా ఆటను ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లాలో ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా.. నగరంలో ఐటీ టవర్ ను ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునేది అభివృద్ధి సంక్షేమమని తెలిపారు. ఎన్నికలు వస్తే సంక్రాంతి గంగిరెద్దుల వచ్చినట్లు వస్తారు.. జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు పార్లమెంటులో చర్చ జరగనుంది. చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో 5 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని బోపాల్ ఆర్‌కమలపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను భౌతికంగా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్. ఉదయం 11 గంటలకు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ, నూతన ఎంపీ డివో ఆఫీస్ ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు.
నేడు ప్రగతిభవన్ నుంచి ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ఒకేసారి తరగతులను ప్రారంభించనున్నారు.