బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విధానసౌధ భద్రతా విభాగం డీసీపీ ఎం.ఎన్. కరిబసవనగౌడ రాసిన లేఖ బయటపడింది. అందులో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు తేలిసంది. జూన్ 4న, డీసీపీ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు.
శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్‌మార్టం నివేదికలు వెలువడ్డాయి. నివేదిక ప్రకారం.. ఈ ఐదుగురు "ట్రామాటిక్ అస్ఫిక్సియా" కారణంగా మరణించారని తేలింది. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై అధిక ఒత్తిడి వల్ల ఆక్సిజన్ లేదా రక్త సరఫరా కోల్పోవడాన్ని సూచిస్తుంది.