విద్యాశాఖపై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువ రావడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి నెలలోజుల్లోనే మళ్ళీ పరీక్షలు పెట్టి వారిని కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తామని పేర్కొన్నారు. పదో తరగతిలో పాసైన వారికి…
ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు రాసిన 6.22 లక్షల మంది విద్యార్థుల్లో.. 4.14 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 67.26గా ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా…
ఏపీ పదో తరగతి ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అయితే.. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి ఫలితాలను మరికొన్ని గంటల్లో ప్రభుత్వం విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అయితే.. ఆ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన bse.ap.gov.in లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అయితే.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు అందులో బాటులో ఉంటాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఈ పరీక్షలు…