టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఫైర్ అయ్యారు. రాజమౌళి సినిమాలు చూసి హిందూ దేవుళ్లపై గౌరవం ఉందనుకున్నాం అని, ఆయన కామెంట్లపై హిందువులు ఇప్పుడు రగిలిపోతున్నారన్నారు. ఆంజనేయుడిపై నమ్మకం లేదనడం హిందువుల మనోభవాలు దెబ్బతీయడమే అని ధ్వజమెత్తారు. అంత పేరు, అంత డబ్బు, ప్రతిష్ట హిందూ దేవుళ్లను ఉపయోగించుకుని తెచ్చుకుంటారని విమర్శించారు. హిందూ దేవుళ్లని, సనాతన ధర్మాన్ని అవమానించే హక్కు ఎవరిచ్చారు?..…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా ఈ రోజు పోలింగ్ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగిస్తూ ప్రజలకు స్ఫూర్తినిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన భార్య రమ రాజమౌళితో కలిసి షేక్‌పేట్ డివిజన్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా, సాదాసీదాగా వచ్చిన రాజమౌళి దంపతులు ఓటు హక్కును వినియోగించారు. Also Read : Dharmendra: సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత ఈ…
‘బాహుబలి: ది ఎపిక్’ మెగా రీ–రిలీజ్‌కి సంబంధించి ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మహా చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం చుట్టూ మళ్లీ ఉత్సాహం మొదలైంది. ఇప్పటికే ప్రభాస్ ఒక వీడియో బైట్ రిలీజ్ చేస్తూ “ఈ ఇతిహాసాన్ని మళ్లీ పెద్ద తెరపై చూడండి” అంటూ అభిమానులను థియేటర్లకు…