TTD Srivani Tickets: తిరుమలలో వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీనివాసుడి దర్శనానికి సుమారు 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆఫ్ లైన్ విధానంలో టిక్కెట్ల జారీకి మంగళం పాడే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ లైన్ విధానంలో తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు దర్శన టిక్కెట్లను అధికారులు జారీ చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. మార్చి నెలకు సంబంధించిన వివిధ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎల్లుండి నుంచి ఆన్‌లైన్‌లో మార్చి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.. 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంతేకాదు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోటా టోకెన్లు విడుదల చేయనున్నారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది.