శ్రీశైలం జలాశయ నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని సెంచునరి హల్ లో డీడీఆర్‌సీ నీటి పారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ఒకే రాష్ట్రం వున్నప్పుడు నీటి వాడకంపై ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.. శ్రీశైలం జలాశయాలను రెండు రాష్ట్రాలవారు ఎవరికి వారే వాడితే.. రైతులే నష్టపోతారన్నారు మంత్రి కేశవ్. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.