ఓవైపు వర్షాలు, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కృష్ణా నదిలో వదర ప్రభావం కొనసాగుతోంది.. దీంతో, ఈ ఏడాదిలోనే వరుసగా మూడోసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు అధికారు.. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుండగా.. ఈ ఏడాదిలో మూడోవ సారి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు అధికారులు.. జలాశయం నాలుగు గేట్లను 10 అడుగులు మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు..