Boat Accident in Srinagar’s Jhelum River: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం శ్రీనగర్ సమీపంలోని జీలం నదిలో పాఠశాల పిల్లలు మరియు స్థానికులను తీసుకెళుతున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 12 మంది పిల్లలు రక్షించబడ్డారు. ప్రస్తుతం సమీపంలోని ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
Also Read: Lok Sabha Elections 2024: 45 రోజులు.. రూ.4,650 కోట్లు సీజ్!
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా జీలం ప్రవాహం చాలా ఎక్కువగా ఉందని, రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా ఉందని అధికారులు చెప్పారు. గండ్‌బాల్ నుంచి శ్రీనగర్‌లోని బట్వారాకు పిల్లలను తీసుకువెళుతుండగా పడవ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. గత 72 గంటలుగా కాశ్మీర్ లోయలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జీలం నది ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది.