Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో స్థానికేతర కార్మికుడు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తిని పంజాబ్ అమృత్‌సర్‌కి చెందిన అమృత్ పాల్ సింగ్‌గా గుర్తించారు. క్షతగాత్రుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన శ్రీనగర్ పట్టణంలోని షహీద్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
Read Also: Yogi Adityanath: “కృష్ణుడు 5 గ్రామాలు అడిగాడు, మేం 3 అడుగుతున్నాం”.. అయోధ్య, మధుర, కాశీలపై యోగి..
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేత సమర్థవంతంగా జరుగుతుండటంతో గతంలోలా కాకుండా అక్కడి ఉగ్రవాదులు హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. స్థానికేతరులు, హిందువులు, దేశానికి మద్దతుగా ఉండే వారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ ఘటనకు ముందు గతేడాది అక్టోబర్ నెలలో పుల్వామాలో ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వలస కార్మికుడిని కాల్చి చంపారు. అదే రోజు పోలీస్ ఇన్స్‌పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై కాల్పులు జరిపారు. 2019 నుంచి స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.