గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్మిక విభాగం అధినేత శోభన్‌రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. పార్టీ విధానం వల్ల తమకు నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో మీ వెంట ఉన్న కార్యకర్తలు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో బాధపడ్డారన్నారు. తాను 24 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానన్నారు.…