శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి గార మండలం రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిని హత్య చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఈ మేరకు సర్పంచ్‌పై కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే… మంగళవారం రాత్రి మరురానగర్‌లోని సర్పంచ్ కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకెళ్లింది. Read Also: గుడ్ న్యూస్… ఏపీలో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు…
కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరు కావడంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే… ఆముదాలవలస మండలం తోటాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 121లో 70 సెంట్ల స్థలాన్ని భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకుని…
శ్రీకాకుళం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మంగళవారం రాత్రి జిల్లాలోని ఇచ్చాపురంలో నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు కవిటి, కంచిలి మండలాల్లోనూ భూమి కంపించింది. గత వారం రోజులలో రెండోసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. Read Also: ఒక ఇంటికి ఒకటే మీటర్.. ఈ మ్యాటర్ వర్కవుట్ అవుతుందా? ఇచ్చాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని…
ఆ జిల్లాలో ఆయన కాకలు తీరిన రాజకీయ నేత. కానీ.. సార్‌కు మైనస్ మేడమే అని చర్చ ఉంది. తూకానికి సరితూగే వాళ్లకు మేడమ్ టిక్ పెడితే.. సార్ ఓకే చెప్పాలట. కుమారుడి తీరు కూడా ఆయనకు సన్‌స్ట్రోక్‌గా మారిందట. గతంలోనూ ఇలాంటి అనుభవాలతో పొలిటికల్‌గా దెబ్బతిన్నా.. ఆయన వైఖరిలో ఎందుకు మార్పు రాలేదు? ఎవరా నాయకుడు ? ఇంట్లో భార్యాబిడ్డల మాట కాదనలేకపోతున్న ప్రజాప్రతినిధి..! అద్భుతమైన వాక్ చాతుర్యం.. ఎవరినైనా కలుపుకొని వెళ్లే మనస్తత్వం సిక్కోలు…
బంగాళాఖాతంలో జవాద్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వద్దకు దూసుకువస్తోంది. ఉత్తర దిశగా కదులుతూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80-100 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన…
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులపై శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలను వీరు ఆవిష్కరించారు. దీంతో కరోనా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీరితో పాటు ఈ కార్యక్రమానికి ర్యాలీగా వచ్చిన పలువురు టీడీపీ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: క్రేజ్ అంటే ఇదేరా… మార్కెట్‌లో జగన్ ఆటం బాంబులు టీడీపీ ర్యాలీ సందర్భంగా…
కోతి వేషాలు మనకు తెలియనిది కాదు. అయితే కోతి వేసే వేషాలు చూస్తే నవ్వు రాక మానదు. తాజాగా ఓ కోతి చీరను పట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. చేతికి దొరికిన చీరను కప్పుకుని సిగ్గులొలికింది. ఈ సీన్ ఏపీలో శ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద చోటు చేసుకుంది. Read Also: ఇకపై ఆ షో చేయనంటున్న ఎన్టీఆర్ ? దీంతో కోతి చేష్టల దృశ్యాలను పలువురు ఆసక్తిగా తిలకించడమే కాకుండా సెల్‌ఫోన్‌లలో బంధించారు. రోడ్డుపై…
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల మరియు కాలేజ్ పిల్లలకు ఆట స్థలం క్రింద ఉన్న ఒకే ఒక్క స్థలంలో ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దాంతో ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు పాఠశాలల విద్యార్థులు. మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి… చుట్టుపక్కల రెండు మూడు ఊర్లలో ఒక్క గ్రౌండ్ కూడా లేదు. మాకు ఈ ఒక్క గ్రౌండ్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కోల్డ్…
కేంద్రమంత్రి వస్తున్నారని వారంరోజుల ముందు నుంచే హడావిడి చేశారు. బోలుడన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు కూడా. తీరా.. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి వచ్చాక.. లెక్కలు చెప్పలేక తడబడ్డారు. సీనియర్లు అనుకున్నవారే గుడ్లు తేలేశారు. కేంద్రమంత్రి పర్యటనలో జరిగిన పరిణామాలపై చర్చ! శ్రీకాకుళం జిల్లాలో ఖద్దరుకు పేరొందిన పొందూరులో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఎన్నోఏళ్లుగా ఆదరణ లేకుండా పోయిన పొందూరు ఖాదీ, ఖద్దరు పరిశ్రమకు ఆమె పర్యటనతో దశ తిరిగిపోతుందని భావించారు సిక్కోలు…
చెన్నైలో వేటకు వెళ్లి గల్లంతైన సిక్కోలు మత్స్యకారుల ఆచూకీ లభ్యం అయ్యింది. మత్స్యకారులు సురక్షితంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు కుటుంబసభ్యులు. రామయ్యపట్నం – చెన్నై మధ్యలో మత్స్యకారుల బోటును గుర్తించారు కోస్ట్ గార్డు. ఆ తర్వాత మత్స్యకారుల బోటును కొంతమేర వరకూ తీసుకొచ్చిన కోస్టుగార్డు బోటు… చెన్నైకు చెందిన ఎస్.కె.టి కంపెనీకి చెందిన మరో మత్స్యకార బోటుకు అనుసంధానం చేసారు. మత్స్యకారుల బోటును ఒడ్డుకు లాకొస్తుంది ఎస్.కె.టి కెంపెనీకి చెందిన ఫిషింగ్ బోటు. ఈ రాత్రికి వారు చెన్నైలోని…