శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ వెబినార్ ద్వారా గవర్నర్ కీలకోపన్యాసం చేశారు. పురాతన జ్ఞాన సంపద వల్లే ప్రపంచ వేదికపై విశ్వగురుగా భారతదేశం నిలిచిందని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. గొప్ప వారసత్వం, సహజ వనరులు, సైనిక బలం ఫలితంగా భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఆవిర్భవించింది. భారతీయులు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. భారతీయ వేదాలు అంతర్జాతీయ సౌభ్రాతృత్వం,…