Sri Lanka Squad for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును గురువారం ఎస్‌ఎల్‌సీ ప్రకటించింది. ఆల్ రౌండర్ వనిందు హసరంగా శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో శ్రీలంక టీ20 కెప్టెన్‌గా హసరంగా ఎంపికైన విషయం తెలిసిందే.