Sri Lanka Parliamentary Election : శ్రీలంకలో మధ్యంతర ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓట్లు వేయనున్నారు.
IMF bailout for Sri Lanka: చుట్టూ ఉండే సముద్రపు నీటి మాదిరిగా.. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలతో.. సంక్షోభ సంద్రంలో చిక్కుకున్న శ్రీలంకకు.. IMF రూపంలో శ్రీరామరక్ష లభించింది. ఆ.. ద్వీప దేశానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. నాలుగేళ్లపాటు అమలుచేయనున్న ఈ బెయిలౌట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తక్షణం 333 మిలియన్ డాలర్లు విడుదల చేయనుంది.
శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన 134 ఓట్లు సాధించి ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు.
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గట్టున పడేసే నాయకుడి ద్వీపదేశం శ్రీలంక ఎదురుచూస్తోంది. ఇవాళ శ్రీలంకలో కొత్త నాయకత్వం కొలువుదీరబోతోంది. ఆ దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా అంత సులభమేమీ కాదు. గత వారం అధ్యక్షభవనంపై నిరసనకారులు దాడి చేయడంతో విదేశాలకు పారిపోయిన గొటబాయ రాజపక్సే స్థానంలో అధ్యక్షుడిని నియమించాలని శ్రీలంక పార్లమెంట్ నిర్ణయించింది.
తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకలో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం 36 గంటల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండడంతో ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం…