12 New Projects In Sri City: విశాఖపట్నంలో జరగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా శ్రీ సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శృంగారపురి (శ్రీసిటీ)లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీఎం వర్చువల్‌గా 5 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించారు. అదేవిధంగా 12 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కొత్తగా ప్రకటించిన పారిశ్రామిక ప్రాజెక్టులకు మొత్తం రూ. 2,320 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.…
తిరుపతి జిల్లాలో మరొక కీలకమైన ప్రాజెక్టు వచ్చి చేరింది.. ఈ రోజు శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి నారా లోకేష్... 5వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.. శ్రీసిటీలో ఎల్‌జీ గృహోపకరణాలు తయారీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ఉద్యోగావకాశాలతో పాటు.. 839 కోట్ల రూపాయలతో మరో 5 అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు..
జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం ‘డైకిన్’ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డైకిన్ ఇండియా, రెచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారుచేసి.. విదేశాలకు ఎగుమతి చేయనుంది. ఈ ప్రాజెక్టులో డైకిన్ మెజారిటీ భాగస్వామిగా ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఈ…
రేపు సోమశిల జలాశయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. రేపు(సోమవారం) శ్రీసిటలో 8 పరిశ్రమలకు భూమి పూజ చేయడంతో పాటు మరో 16 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. అలాగే ఐదు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు.
TG Bharath: రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ జోన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజు, కమిషనర్ శ్రీధర్‌తో పాటు అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ జోన్ల గురించి మంత్రి భరత్ ఆరా తీశారు. భూముల విలువ, నీరు, విద్యుత్, ఇతర…