12 New Projects In Sri City: విశాఖపట్నంలో జరగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా శ్రీ సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శృంగారపురి (శ్రీసిటీ)లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీఎం వర్చువల్‌గా 5 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించారు. అదేవిధంగా 12 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కొత్తగా ప్రకటించిన పారిశ్రామిక ప్రాజెక్టులకు మొత్తం రూ. 2,320 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా 12,365 మందికి ఉద్యోగాలు సృష్టించబడనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఇంజనీరింగ్, ఫార్మా ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో కంపెనీలు తమ యూనిట్లను స్థాపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. భారతదేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక టౌన్‌షిప్ శ్రీ సిటీగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే డైకెన్, ఇసుజూ, క్యాడ్‌బరీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇక్కడి నుంచే వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి అన్నారు. జపాన్, బెల్జియం, జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలకు చెందిన కంపెనీలు శ్రీ సిటీలో పనిచేస్తున్నాయని తెలిపారు చంద్రబాబు..
Read Also: Sonakshi Sinha : మనం చేసే ప్రతి తప్పు.. కొత్త పాఠం నేర్పిస్తుంది
ఇక, 18 నెలల్లోనే 22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు.. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి కీలక గణాంకాలు ప్రకటించారు. గత రెండు రోజులలోనే 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. గత 18 నెలల్లో మొత్తం 22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షించినట్టు తెలిపారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను పారదర్శకంగా అందించేందుకు దేశంలోనే తొలిసారి ఎస్క్రో ఖాతా వ్యవస్థ అమలు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, త్వరలో శ్రీ సిటి సమీపంలో ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం జరుగుతుందన్నారు.. పరిశ్రమల విస్తరణ కోసం 6 వేల ఎకరాల భూమి కేటాయిస్తాం అన్నారు.. ఉత్తమ మౌలిక వసతులతో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని.. 2028 నాటికి శ్రీ సిటీని ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..