కృష్ణానదీ జలాల వినియోగంపై క్రమక్రమంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం పెరుగుతున్నది. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పేరిట రిజర్వాయరు సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలం నీటిని తరలించుకుపోతారని తెలంగాణ ఆరోపణ. రాజోలిబండ డైవర్షన్ దగ్గర పనులకూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది.అయితే ఈ క్రమంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని దొంగ అని జగన్ గజదొంగ అని వ్యాఖ్యానించడం. తర్వాత ఏకంగా రాక్షసుడని తిట్టిపోయడం వేడిపెంచింది. ఇలా మాట్లాడటం సమంజసం…