కరోనా కట్టడి కోసం దేశీయ వ్యాక్సిన్లతో పాటు.. విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది భారత్.. రెండు డోసుల వ్యాక్సిన్ల తర్వాత.. ఇప్పుడు బూస్టర్ డోసును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది.. స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ సింగిల్ డోసు టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు…
దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో 91 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. 100కి పైగా కేసులు ఇప్పటికే వెలుగు చూశాయి. అయితే కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా ఒమిక్రాన్ సోకుతుందన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. Read Also: మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వదలని ఒమిక్రాన్ ఈ…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఇక, ఇప్పుడు సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవర పెడుతోంది.. జట్ స్పీడ్‌తో వ్యాపిస్తున్న ఈ వైరస్.. అత్యంత ప్రమాదకారి అని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించగా.. మరోవైపు.. ఒమిక్రాన్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంపై కూడా దృష్టిసారించారు శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం షురూ…
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తుండటంతో వేగంగా వ్యాక్సినేషన్ ను అమలు చేస్తున్నారు. దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా, మరో మూడు వ్యాక్సిన్లకు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. భారత్‌కు చెందిన జైడస్ క్యాడిలా, కోవాక్స్, స్పుత్నిక్ లైట్‌లు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీకి ధరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మొదటగా భారత్‌కు చెందిన జైడస్…
కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. ప్రపంచంలో మొదటగా కరోనాకు వ్యాక్సిన్ ను తయారు చేసిన రష్యా ఆ దేశంలోని ప్రజలకు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ ను అందించింది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ దేశంలో మరలా కేసులు పెరుగుతున్నాయి. Read: తెలకపల్లి రవి : చైనా కమ్యూనిస్టు పార్టీ…
భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రెండు డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతులు లభించాయి. వ్యాక్సిన్‌ను అనేక ప్రాంతాల్లో అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ సంస్థ రష్యానుంచి దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తున్నది. అయితే, రష్యాలో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసిన గమలేరియా సంస్థ సింగిల్ డోస్ లైట్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లైట్ వెర్షన్ డోసులను రష్యాలో ప్రజలకు అందిస్తున్నారు. Read: అజిత్ అభిమాలకు గుడ్ న్యూస్… డబుల్ ట్రీట్…!!…
కరోనాకు చెక్‌పెట్టేందుకు ఇప్పుడు మనముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషనే అని వైద్యనిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు మాత్రం.. రెండు డోసులు తీసుకోవాలి.. మొదటి డోస్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ ప్రొటోకాల్‌ను అనుసరించి రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఒక్క వ్యాక్సిన్‌తో పనిముగించే సంస్థలు కూడా ఉన్నాయి.. ఈ నేపథ్యంలో భారతీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ గుడ్‌న్యూస్ చెప్పింది.. రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ…