డాక్టర్ రెడ్డీస్ గుడ్‌న్యూస్.. సింగిల్ డోస్ వ్యాక్సిన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాకు చెక్‌పెట్టేందుకు ఇప్పుడు మనముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషనే అని వైద్యనిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు మాత్రం.. రెండు డోసులు తీసుకోవాలి.. మొదటి డోస్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ ప్రొటోకాల్‌ను అనుసరించి రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఒక్క వ్యాక్సిన్‌తో పనిముగించే సంస్థలు కూడా ఉన్నాయి.. ఈ నేపథ్యంలో భారతీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ గుడ్‌న్యూస్ చెప్పింది.. రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ లైట్ టీకాను భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.. దీనిపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.. గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ఈ సింగిల్-డోస్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే రష్యా ఆమోదం తెలిపింది.. దీంతో, అనేక దేశాలలో ట్రయల్స్ కూడా సాగుతున్నాయి..
ఈ సింగిల్ డోస్ టీకాను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని భారత్ భావిస్తోంది. ఇందుకు రష్యా తయారీదారు, దాని భారతీయ భాగస్వామ్య కంపెనీలతో సహా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నియంత్రణ సంస్థ అధికారులను ఇటీవల ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.. అన్ని అనుకూలిస్తే.. భారత్‌లో అందుబాటులోకి రానున్న తొలి సింగిల్ డోస్ టీకా స్పుత్నిక్-వీ లైట్ కానుంది. మరోవైపు.. ఇప్పటికే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అత్యవసర ఉపయోగానికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీజఐ) నుండి ఇప్పటికే ఆమోదం లభించగా.. దాని భారతీయ భాగస్వామి అయిన డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటోంది. కాకపోతే ఇది రెండు డోసుల వేయాల్సిందే.. దీనిపై ఓవైపు కసరత్తు చేస్తూనే.. సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది డాక్టర్ రెడ్డీస్..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!