వణికిస్తున్న ‘చలి పులి’.. 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది.. ముఖ్యంగా ఏజెన్సీలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీని వణికిస్తోంది చలి.. జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర చలి అలుముకుంది.. ఈ సీజన్లో తొలిసారిగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగుల, మినుములూరు ప్రాంతాల్లో 5 డిగ్రీలు నమోదు కాగా, పాడేరు, అరకు, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…
* శ్రీ సత్యసాయి: సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు.. నేడు పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని, పయ్యావుల కేశవ్, అనిత, సత్యకుమార్ .. వీఐపీల తాకిడితో పుట్టపర్తిలో భారీ భద్రత ఏర్పాటు * తిరుమల: ఇవాళ టిటిడి పాలకమండలి సమావేశం.. వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు జారీ విధానంపై నిర్ణయం తీసుకోనున్న…
శ్రీశైలంలో కార్తీక మాసం చివరి సోమవారం సందడి కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం తరలివచ్చారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, కార్తీక మాసం పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు శివనామ స్మరణలో తరిస్తున్నారు. భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు…
కార్తీక మాసం చివరి సోమవారం ఎఫెక్ట్.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో.. ఓవైపు నదీ తీరాలు.. మరోవైపు శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలముకుంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. పలు స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు…
* హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ.. అందెశ్రీ స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ * ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్.. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్.. అన్ని కేసులపై నేడు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు * ఏపీలో…
డీజిల్ బస్సులకు గుడ్‌బై.. ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే..! డీజిల్ బస్సులకు గుడ్‌బై చెబుతున్నాం.. ఇకపై కొనే ప్రతి బస్సు ఎలక్ట్రిక్ బస్సే ఉంటుందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. విశాఖ ద్వారక ఆర్టీసీ బస్టాండ్‌లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. బస్సుల లభ్యత, శుభ్రత, టికెట్ వ్యవస్థ వంటి అంశాలపై ఆయన ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ఫ్రీ…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఆర్థిక నేరస్తుడి అరెస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆర్ధిక నేరస్తుడు అనిల్ చోఖరాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబైలో అనిల్ చోఖరాను అరెస్ట్ చేసిన సిట్.. స్థానిక కోర్టులో హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ తీసుకువచ్చారు. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ డబ్బులో 77 కోట్ల…
* హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కపిల్ సిబల్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి రేవంత్ * సింగపూర్ – విజయవాడ విమాన సర్వీసు నేటి నుంచి ప్రారంభం.. ఈ రోజు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రారంభం కానున్న విమాన సర్వీసు * అనకాపల్లి జిల్లా: నేడు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటన.. మెడిటెక్ జోన్, బ్రాండిక్స్ అప్పెరల్ సిటీని సందర్శించనున్న పీయూష్ గోయల్.. * శ్రీ సత్యసాయి :…
* ఈ రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు .. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఉదయం 9 గంటల నుంచే వెల్లడికానున్న “ట్రెండ్స్”.. మధ్యాహ్నం వరకు ఫలితాలు దాదాపు స్పష్టం అయ్యే అవకాశం.. 38 జిల్లాల్లో, 243 అసెంబ్లీ స్థానాల్లో రెండు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు కారణంగా బీహార్ లోని పాఠశాలలు, ఇతర విద్యాలయాలకు ఈరోజు సెలవు * నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం…
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్… కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధారం రోజు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. ర్యాలీ కి అనుమతి లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్నారు పోలీసులు.. దీంతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు రాంబాబు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టి…