ప్రభుత్వం జిల్లాలో కృష్ణా నదీ తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తోంది. ఇబ్రహీంపట్నంను ఆనుకుని ఉన్న కృష్ణా లంక భూములను మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా, జిల్లా కలెక్టర్ లక్షిషా, ఇతర అధికారులు పరిశీలించారు. కృష్ణా నదిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోనీ పెద లంక, చిన లంకలో ఉన్న లంకభూములు పరిశీలించారు. మూడు కిలోమీటర్లు లంక భూముల్లో కాలినడకన తిరిగారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో…
IIT Madras : సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటి మద్రాసు నిర్ణయించింది. ఐఐటిఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం, పరిశోధన, శిక్షణ, సాంకేతికతలో రాష్ట్రం ముందుకు పోవడానికి దోహదం చేస్తాయి. 1.…