Vemulawada Temple: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు నాసిరకం లడ్డూల అమ్మకాలు కొనసాగించడంతో పలు విమర్శలకు తావిస్తోంది. రెండు రోజుల క్రితం తయారుచేసిన లడ్డూల్లో తేమ అరకపోవడం, బూజు పట్టిన లడ్డూలనే అమ్ముతున్నారు. పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత వాటి నుంచి వాసన రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.