ఒమిక్రాన్ టెన్షన్ ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. డెల్టా నుంచి బయటపడేలోగా ఒమిక్రాన్ వేరియంట్ ఇబ్బందులు పెడుతుండటంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డెల్టా వేరియంట్‌లో 8 రకాల మ్యూటేషన్లు ఉంటే, ఒమిక్రాన్‌లో 30 రకాల మ్యూటేషన్లు ఉన్నాయి. అంతేకాదు, డెల్టా వేరియంట్ వ్యాప్తి రేటు 1.47 ఉంటే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి రేటు 1.97గా ఉంది. ఇదే ఇప్పుడు అందర్ని భయపెడుతున్నది. డెల్టా విజృంభించిన సమయంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. …