ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు వేగవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని మంత్రి లోకేష్ చెప్పారు.. ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యేవరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్‌లు ఇవ్వకూడదని అన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో దర్యాప్తును పోలీసులు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా ఇవాళ మొత్తం ఐదుగురు మైనర్లను కలిపి విచారణ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఘటన ఎలా జరిగింది ? అనే దానిపై ఇప్పటివరకు పోలీసులు వివరాలను సేకరించారు. విచారణలో భాగంగా మైనర్లతో పాటు కొందరు వ్యక్తులు చెప్పిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. కేసుతో ముడిపడిన సాంకేతిక, వైద్యపరమైన, శాస్త్రీయ ఆధారాలను…