దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని ..అప్పటి వరకు న్యాయస్థానం దీనిపై తన సమయాన్ని వెచ్చించవద్దని సోమవారం కేంద్రం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కేంద్రంపై పలు ప్రశ్నలు సంధించటంతో పాటు కొన్ని సూచనలు కూడా చేసింది. దేశద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించే వరకు పౌరుల ప్రయోజనాల పరిరక్షణపై కేంద్రం…