Special Story On Patanjali: ప్రకృతి ఆశీర్వాదమే పతంజలి ఆయుర్వేదం అనే ఆకట్టుకునే నినాదంతో ప్రజాదరణ పొందిన సంస్థ పతంజలి. దీన్ని.. యోగా గురు బాబా రామ్‌దేవ్ 1995లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ప్రారంభించారు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ రంగంలో అతితక్కువ కాలంలో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించి రికార్డు నెలకొల్పింది. ఒకానొక దశలో అత్యంత ప్రభావశీల కంపెనీల సరసన చేరింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ల తర్వాత 4వ స్థానాన్ని ఆక్రమించింది.