ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల కోసం ఏర్పాటు చేసిన సమావేశం అజెండాలో మొదట ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి.. ఆ తర్వాత తొలగించింది కేంద్ర హోంశా శాఖ.. ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది.. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం హోంశాఖ సమావేశం అజెండాలో ప్రత్యేకహోదా అంశం పొరపాటున చేర్చారని తెలిపారు.. ఈనెల 17న జరిగే సమావేశం..…
వైసీపీ నేతలు ప్రత్యేక హోదా వచ్చేసినట్టు నిన్న సాయంత్రం వరకు గొప్పలు చెప్పారు.. సాయంత్రానికి కేంద్రం మాట మారిస్తే.. అది చంద్రబాబు వలనే అంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. అనంతపురంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అంటే మీరు అంత బలహీనంగా ఉన్నారా..? లేక చంద్రబాబు కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నారా? అని ప్రశ్నించారు.. ముందు హోదా అంశం లిస్ట్‌లో ఉందో లేదో తేల్చండి అని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. మొదట అనుకున్న అజెండాలో మార్పులు చేసిన విషయం తెలిసిందే.. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీకి ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు లేకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర హోంశాఖ.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి (కేంద్ర, రాష్ట్ర వ్యవహరాలు) నేతృత్వంలో “వివాద పరిష్కార సబ్ కమిటీ” ఏర్పాటు అయిన విషయం తెలిసిందే.. అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు…
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఎమ్మెల్యే ఆర్ కె రోజా ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన పైన త్రిసభ్య కమిటీ వేయడం శుభపరిణామం అన్నారు. హోంశాఖ ప్రత్యేక హోదా అంశంగా చెర్చడం సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయంగా మేము భావిస్తున్నాం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్నోరకాలుగా పోరాటం చేశారు జగన్. ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రిని…
నిత్యం వార్తల్లో వుండే వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు. కర్నూలులో హనుమంతరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధాని మోడీ పని పాట లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఏమి చేశారో చెప్పకుండా రాష్ట్ర విభజనపై మోడీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు వి హనుమంతరావు. ప్రధాని మోడీ లేని పంచాయతీలు పెడుతున్నారన్నారు. స్పెషల్ స్టేటస్ 10 ఏళ్ళు కావాలన్నవాళ్ళు ఇచ్చారా అని ప్రశ్నించారు. విభజన సమయంలో సుష్మా స్వరాజ్ కూడా వున్నారు. ఆమె ఏం…
ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.జగన్ ఢిల్లీలో చెంచాగిరీ చేస్తున్నారు.. ఏపీలో దాదాగిరి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్ ఏంటో బీజేపీకి అర్ధం చేసుకోని పరిస్థితుల్లో లేదు. సీఎం జగన్ నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా బిర్యానీ లాంటిది.. ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిదన్నారు ఆదినారాయణ…
దేశంలోనే అత్యంత మౌలిక సదుపాయాలను అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు ఉందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. కోవిడ్ సమయంలో సైతం ప్రతీ పేద వాడిని ఆదుకున్నాం అన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యాలకు గురైన విద్యా, వైద్యంలో సమూల మార్పులు చేసాం. ప్రతీ పార్లమెంట్ కి ఓ మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబుకు ప్రజల బాగోగులు అవసరంలేదు.. కేవలం పదవీ కాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. రెండుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి. ఎందుకు ఇంటి లోన్లు ఉచితంగా ఇవ్వలేదన్నారు.…
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని పేర్కొంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది రమేష్ చంద్రవర్మ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన కోర్టు… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.…
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు అఖిలపక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలి అనే దానిపై సుమాలోచనలు జరిపారు. అదేవిధంగా సభను సజావుగా జరిగేలా సహకరించాలని ప్రభుత్వం సభ్యులను కోరింది. ఈ సమావేశం అనంతరం వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి…