టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఏపీ ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయ్యింది.. ప్రివిలేజ్ కమిటీ ముందు కూన రవి హాజరుకాకపోవడాన్ని ధిక్కారంగా భావిస్తున్నామని చైర్మన్ కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు.. ఇవాళ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిని ఆదేశించింది ప్రివిలేజ్ కమిటీ.. కానీ, వారు హాజరు కాలేదు.. ఇక, ప్రివిలేజ్ కమిటీ తదుపరి సమావేశం వచ్చే నెల 14వ తేదీన జరపాలని నిర్ణయించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్…
ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం… సరుబుజ్జిలి మండలంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.. ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కాదు, బడుగు, బలహీన వర్గాల వారికి ప్రభుత్వం అందిస్తున్న ఏ పథకం అందడం లేదో సమాధానం చెప్పాలన్నారు.. మాటలు చెప్పడం కాదు… చేతల్లో చేసి చూపాలని హితవుపలికిన ఆయన.. నెత్తిమీద రూపాయి పెడితే చెల్లని వాళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు.. గత పాలకులు స్కూళ్లలోహ సదుపాయాలున్నాయో…
మహిళలపై జరుగుతోన్నఅఘాయిత్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళంలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంతో పాటు పురుషుల ఆలోచనా ధోరణి మారాలన్నారు.. న్యాయానికి అన్యాయం జరిగినప్పుడు అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గమని.. బయటికొచ్చి న్యాయం చేయాలన్న ఆయన.. తెలంగాణలో మృగాళ్లను సీపీ సజ్జనార్ వేటాడిన విధానం అద్భుతం.. అందుకే సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను మరోసారి అభినందిస్తున్నట్టు తెలిపారు.. మగాడు…
తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి లబ్ధిదారులకు మధ్య దళారులే లేరు… ప్రతీ పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం.. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కొంచాడ గ్రామంలో హరితవనహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో దొరికింది దొరికనట్లు దోచుకుతిన్నారు.. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి జన్మభూమి కమిటీల వరకూ గుటకాయస్వాహా చేశారు.. వాళ్లకే సరిపోకపోతే ఇక ప్రజలకేం పంచుతారు అంటూ ఆరోపణలు…
సీఎం వైఎస్ జగన్ అనుకున్నది సాధిస్తారని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. సింహాచలంలో లక్ష్మీ నృసింహ్మ స్వామిని దర్శించుకున్నఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ ఈవో, అధికారులు, వైదిక వర్గాలు.. ఆ తర్వాత గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచగ్రామాల భూసమస్య అన్నది నేను పుట్టక ముందునుంచే ఉందన్నారు.. వైసీపీ పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్న ఆయన.. గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి…